తెలంగాణ కరోనా అప్డేట్

- June 19, 2022 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది.రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు (236) దాటింది. మరోవైపు కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల మార్క్ దాటడం టెన్షన్ పెడుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల 026 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 19వేల 715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 180 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 24గంటల వ్యవధిలో మరో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరట కలిగించే విషయమేంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 96వేల 055 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 89వేల 918 మంది కోలుకున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో నేటివరకు 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని(219) అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. ఈ నెల 16న 285 కొవిడ్ కేసులు, 17న 279 కేసులు, 18న 247 కేసులు వచ్చాయి. క్రితం రోజు రాష్ట్రంలో 27వేల 841 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 279 మందికి పాజిటివ్ గా తేలింది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com