పేకాట ఆడుతూ పట్టుబడిన 18మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు!
- June 20, 2022
కువైట్: పేకాట ఆడుతూ పట్టుబడిన పద్దెనిమిది మంది ప్రవాసులను డిపోర్టేషన్‌కు పంపారు. మళ్లీ వారు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. రాత్రి వేళల్లో కొంత మంది పేకాట ఆడుతున్నారని, వారి తీరుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు పేకాట ఆడుతున్న అపార్ట్ మెంట్‌పై దాడి చేసి 18మందిని అరెస్టు చేశారు. గురు, శుక్రవారాల్లో సాయంత్రం అపార్ట్ మెంట్‌కు వెళ్లిన వారు రాత్రంతా పేకాట ఆడుతూ మద్యం సేవించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. జూదగాళ్ల నుంచి 1500కు పైగా దినార్లు, పేకాట ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







