వీధిలో అర్ధనగ్నంగా.. పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు ఆదేశాలు

- June 20, 2022 , by Maagulf
వీధిలో అర్ధనగ్నంగా.. పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు ఆదేశాలు

బహ్రెయిన్: డ్రగ్స్ మత్తులో రద్దీగా ఉండే వీధిలో అర్ధనగ్నంగా నడిచినందుకు విచారణలో ఉన్న బహ్రెయిన్ యువకుడికి భారీ జరిమానాల నుండి మినహాయింపు లభించింది. వ్యసనానికి చికిత్స కోసం పునరావాస కేంద్రానికి తరలించాలని హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది. పోలీసులు అతనిని అరెస్టు చేసినప్పుడు సదరు వ్యక్తి తన ఇంటి వెలుపల పాక్షిక నగ్నంగా అసాధారణ స్థితిలో ఉన్నాడని కోర్టు ఫైల్‌లు చెబుతున్నాయి. అతడి తీరును గమనించిన పాదచారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడని, తీసుకెళుతున్న పోలీసు అధికారులపై దాడికి యత్నించాడు. అనంతరం నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో ఆ వ్యక్తి డ్రగ్స్‌ మత్తులో ఉన్నట్లు తేలింది. సదరు వ్యక్తిపై డ్రగ్స్ దుర్వినియోగం, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులపై దాడి చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం అతడి మానసిక ఆరోగ్య స్థితిని తెలపాలని ఆదేశించింది. సదరు వ్యక్తి డ్రగ్స్ కు బానిస అయ్యాడని నిర్ధారించి, అతన్ని పునరావాస కేంద్రానికి సిఫార్సు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com