రీఎంట్రీ వీసాకు కనీస వ్యాలిడిటీ 90 రోజులు
- June 20, 2022
సౌదీ: ప్రవాసులకు ఎగ్జిట్, రీఎంట్రీ వీసా జారీ చేయడానికి అవసరమైన కనీస వ్యాలిడిటీ 90 రోజులు అని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) పేర్కొంది. ఎగ్జిట్, రీఎంట్రీ వీసా వ్యవధిని నెలల్లో (60, 90, 120 రోజులు) నిర్దేశిస్తే, వీసా జారీ చేసిన తేదీ నుండి ప్రయాణానికి మూడు నెలల పాటు చెల్లుబాటు అవుతుందని జవాజాత్ వెల్లడించింది. వీసా వ్యవధి ప్రయాణ తేదీ నుండి లెక్కించబడుతుందని.. లేదా నిర్దిష్ట తేదీకి ముందే తిరిగి వచ్చినట్లయితే వీసా వ్యవధిని దాని జారీ తేదీ నుండి లెక్కించబడుతుందని పేర్కొంది. ఒకే ఎగ్జిట్, రీఎంట్రీ వీసాను జారీ చేయడానికి రుసుము గరిష్టంగా రెండు నెలల వ్యవధితో (ఒకే ట్రిప్) SR200 అని, రెసిడెన్సీ పర్మిట్ చెల్లుబాటు వ్యవధి పరిమితులలో ప్రతి అదనపు నెలకు SR100 ఛార్జ్ చేయబడుతుందని జవాజాత్ తెలిపింది. మల్టిపుల్ ఎగ్జిట్, రీఎంట్రీ వీసాను జారీ చేయడానికి రుసుము గరిష్టంగా మూడు నెలలకు (అనేక ట్రిప్పులకు) SR500గా.. ఇఖామా చెల్లుబాటు వ్యవధిలోపు ప్రతి అదనపు నెలకు SR200 ఛార్జ్ చేయబడుతుందని జవాజాత్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







