తెలుగు తంబీల్ని బుట్టబొమ్మ ఇంప్రెస్ చేయలేకపోతోందా.? ఎక్కడ తేడా కొట్టిందబ్బా.!

- June 20, 2022 , by Maagulf
తెలుగు తంబీల్ని బుట్టబొమ్మ ఇంప్రెస్ చేయలేకపోతోందా.? ఎక్కడ తేడా కొట్టిందబ్బా.!

బుట్టబొమ్మగా పూజా హెగ్దేని ఇస్టపడని వారుండరు.ఆన్ స్క్రీన్ హీరోయిన్‌గానే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఆమె స్టైలింగ్‌నీ, డిగ్నిటీని ఇష్టపడేవారు చాలా మంది వున్నారు.ఆ ఆటిట్యూడ్‌తోనే తక్కువ కాలంలోనే పూజా హెగ్దే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గౌరవం దక్కించుకుంది.
అలాగే, హిందీలోనూ ఆమెకు తగ్గ స్టార్‌డమ్ ఆమెకుంది. ఇక, ఈ మధ్యనే ‘బీస్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది పూజా హెగ్దే. ఇళయ దళపతి విజయ్ సరసన పూజా హెగ్దే నటిస్తోందని తెలియగానే ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, పూజా కూడా ఆమె కెరీర్‌కి ఈ సినిమా ప్లస్ అవుతుందన్న ఎగ్జైట్‌మెంట్‌తో వుంది.
కానీ, రిలీజ్ తర్వాత రిజల్ట్ బెడిసికొట్టింది ‘బీస్ట్’. తెలుగులో ‘బీస్ట్’ హిట్ అవ్వకపోయినా, తమిళంలో భారీ వసూళ్లు సాధించి హిట్టు లిస్టులోనే వుందన్నప్రచారం జరిగింది. కానీ, ఇఫ్పుడేమో, ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది అంటూ, నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారట.. అనే ప్రచారం కొత్తగా తెరపైకి వచ్చింది.
అందుకు కారణం పూజా హెగ్దేనే అంటూ.. పాపం నేరం మొత్తం బుట్టబొమ్మపైనే మోపేస్తే ఎలా.? సినిమా హిట్టూ, ఫట్‌లకు సంబంధించి ఏ ఒక్కరిదో బాధ్యత కాదు కదా. 24 ఫ్రేమ్స్ రెస్పాన్సిబులిటీతోనే ఒక సినిమా విజయమైనా, అపజయమైనా ఆధారపడి వుంటుంది.
అయితే, పూజా హెగ్దే అనవసరమైన ఖర్చుల కారణంగా ఈ సినిమా నష్టాలు మిగిల్చిందనేది నిర్మాతల అభిప్రాయమట. అందుకు జరిమానాగా, పూజాపై చేసిన ఖర్చు మొత్తం తిరిగిచ్చేయాలని ఆమెకు అల్టిమేటం జారీ చేశారట. ఇదెక్కడి అన్యాయమండీ.
తెలుగులో ఇన్ని సినిమాల్లో నటించిన పూజా హెగ్దేకి సంబంధించి ఎవ్వరూ ఈ విధంగా ఆరోపణలు చేయలేదు కదా. డైరెక్టర్, అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో ఫ్రెండ్లీ హీరోయిన్‌గానే పూజాకి పేరుంది కదా. మరి ఎక్కడ తేడా కొట్టిందబ్బా. బుట్టబొమ్మ ఎందుకని తమిళ తంబీల్ని ఇంప్రెస్ చేయలేకపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com