సీబ్ విలాయత్‌లో రెండు భారీ నీటి ప్రాజెక్టులు పూర్తి

- June 22, 2022 , by Maagulf
సీబ్ విలాయత్‌లో రెండు భారీ నీటి ప్రాజెక్టులు పూర్తి

మస్కట్: సీబ్ విలాయత్‌లో ఒమన్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ సర్వీసెస్ కంపెనీ (OWWSC) రెండు భారీ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. మొదటి ప్రాజెక్ట్.. బార్కా-సీబ్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కలుపుతుంది. రెండవది మాబెలా 7లో నీటి పంపిణీ నెట్‌వర్క్ ను విస్తరించనుంది. ప్రాజెక్ట్ మేనేజర్ యూనిస్ అల్ జక్వానీ మాట్లాడుతూ.. బర్కాలోని డీశాలినేషన్ ప్లాంట్ నుండి సీబ్ వరకు వాటర్ ట్రాన్స్ మిషన్ లైన్ ఎనిమిది నెలల వ్యవధిలో పని పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్ట్ నుండి దాదాపు 3,500 మంది నగరవాసులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. 1,000 మిమీ వ్యాసం కలిగిన పైప్‌లైన్‌ను ఉపయోగించి, డీశాలినేషన్ ప్లాంట్ నుండి నీటిని సీబ్ విలాయత్‌లోని పంపిణీ నెట్‌వర్క్‌లకు పంప్ చేస్తారని జక్వానీ వివరించారు. 18km పైప్‌లైన్ రోజుకు సుమారు 100,000m3 నీటిని సరఫరా చేస్తుందని, ఇది 26mn గ్యాలన్‌లకు సమానమని ఆయన తెలియజేశారు. మాబెలా 7లో నీటి పంపిణీ నెట్‌వర్క్ విస్తరణ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న హిలాల్ అల్ రియామి మాట్లాడుతూ.. జనాభా పెరుగుదలను ఎదుర్కోవటానికి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయడం చాలా అవసరమన్నారు. బర్కా డీశాలినేషన్ ప్లాంట్ సామర్థ్యం పెరగడంతో ఇది సాధ్యమైందని, 15 నెలల్లో ప్రాజెక్ట్‌ ను పూర్తి చేశారని తెలిపారు. 646 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నెట్‌వర్క్ కు అనుసంధానించబడిందని, మొత్తం 23 కిలోమీటర్ల పొడవుతో 3,500 మంది నగరవాసులకు నీటిని సరఫరా చేస్తున్నామని రియామి తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com