షార్జా రోడ్లపై ట్రక్కులకు కొత్త టైమ్ షెడ్యూల్
- June 22, 2022
యూఏఈ: షార్జా రోడ్లపైకి వచ్చే ట్రక్కుల సమయాల్లో షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (SRTA) మార్పులు చేసింది. జూలై 4 నుండి ఈ కొత్త టైమింగ్ షెడ్యూల్ అమలులోకి రానుంది. ఎమిరేట్‌లోని అన్ని రహదారులపై ట్రక్ సమయాలను షార్జా పోలీసుల సహకారంతో అమలు చేయనున్నారు. షార్జా-అల్ దైద్ రోడ్, ఎమిరేట్స్ బైపాస్ రోడ్, ఎల్ హ్బాబ్-అల్ మేడమ్ రోడ్ లలో ట్రక్కులు ఉన్న రోడ్లు మినహా ఉదయం 5:30 నుండి 8:30 వరకు.. మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8:00 వరకు ట్రక్కులను నిషేధించారు. అలాగే ఉదయం 5:30 నుండి 8:30 వరకు ట్రక్కుల కదలికలపై నిషేధం విధించారు. కాగా షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్‌లో ట్రక్కు సమయాలను మార్చలేదు. ఎమిరేట్స్ వీధులు, రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు ట్రాన్స్ పోర్ట్ అథారిటీ తెలిపింది. నిబంధనలు పాటించని ట్రక్కుల యజమానులకు జరిమానాలను విధించనున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష