బోటు మునక: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
- June 22, 2022
మస్కట్: పది మందితో వెళుతోన్న చక్కబోటు మునిగిపోవడంతో, ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన దోఫార్ గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ తాకా తీరంలో జరిగిందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. ఈ మేరకు సిడిఎఎ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 మంది ఆసియా జాతీయులు బోటులో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బోటులో కొన్ని వాహనాలు కూడా వున్నట్లు గుర్తించారు. మొత్తం 8 మందిని ఈ బోటు మునక ఘటన నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







