బాలీవుడ్ బాద్షా మూవీలో రానా దగ్గుబాటి: నిజమేనా.?
- June 23, 2022బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ, షారూఖ్ ఖాన్ ఈ మధ్య కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి చాలా ట్రబుల్స్ ఫేస్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ ట్రబుల్స్ కారణంగానే గత కొంత కాలంగా సినిమాలూ, షూటింగులకూ దూరంగా వుండిపోయారు బాద్షా. ఇక, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. అందుకు తగిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయట.
ఇంతవరకూ టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకి తాజాగా ఓ టైటిల్ పరిశీలనలోకి వచ్చింది. అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ‘జవాన్’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అలాగే, మరో అదనపు అట్రాక్షన్ ఏంటంటే, ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
లేటెస్టుగా రానా పాత్రని ఫైనల్ చేశారట. ఈ సినిమాలో నటించేందుకు రానా కూడా ఉత్సాహంగా వున్నాడట. కానీ, ఈ వార్తపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావల్సి వుంది. రానా ఎంట్రీతో తెలుగులోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సౌత్ క్వీన్ నయనతార నటిస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు