పుష్ప అప్‌డేట్: శ్రీ వల్లికి ఏం జరుగుతుంది.?
- June 23, 2022
‘శ్రీవల్లి’గా ‘పుష్ప’ సినిమాతో రష్మికా మండన్నా తెచ్చుకున్న ఫేమ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా ‘శ్రీ వల్లి’ పేరు మార్మోగిపోయింది. రెండు పార్టులుగా రూపొందిన ‘పుష్ప’ మొదటి పార్ట్ అనూహ్యమైన విజయాన్ని అందించడంతో, ‘పుష్ప 2’ కోసం సుకుమార్ కసరత్తులు మరింత ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, ‘పుష్ప’ రెండో పార్టులో ‘శ్రీ వల్లి’ పాత్ర చనిపోతుందట. ఆ ఎఫెక్ట్‌తో పుష్పరాజ్ మరింత క్రూయల్‌గా మారిపోతాడనీ ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
పుష్ప మొదటి పార్ట్ క్లైమాక్స్‌లో విలన్‌గా ఫహాద్ ఫాజిల్ పాత్రను ఎలివేట్ చేసిన విధానం ఎవ్వరూ మర్చిపోరు. ఆ రేంజ్‌లో పుష్పరాజ్, విలన్ అయిన ఫహాద్ ఫాజిల్‌ని కెలికి కెలికి వదిలి పెట్టాడు. గుడ్డలిప్పి రోడ్డులో వదిలి పెట్టాడు. మరి, విలన్‌గారు ఊరుకుంటారా.? ‘సార్’ అనే గౌరవం తగ్గినందుకే ఆయన పుష్పరాజ్ విషయంలో అంతలా రియాక్ట్ అయితే, గుడ్డలిప్పి రోడ్డులో వదిలితే ఇంకేమైనా వుందా.?
ప్రతీకారం తీర్చుకోకుండా వదిలేదే లే.. అందుకే, సెకండ్ పార్ట్‌లో హీరో, విలన్ మధ్య ఎలివేషన్ అలా ఇలా వుండదని భారీగా అంచనా వేస్తున్నారు. ఇక ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసిన సమంత, ‘పుష్ప 2’ కోసం కూడా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుందనీ తెలుస్తోంది. అలాగే శ్రీ వల్లి ప్లేస్‌ని రీ ప్లేస్ చేసేందుకు మరో స్టార్ హీరోయిన్‌ని ఈ సినిమాలో తీసుకోనున్నారట. త్వరలోనే ఆ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







