‘ప్రాజెక్ట్ కె’లో ప్రబాస్ గెటప్ అదేనా.?
- June 23, 2022
ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి ‘ప్రాజెక్ట్ కె’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
తెలుగు సినిమాపై ఇదో విజువల్ వండర్ కానుందని ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ ఎత్తున మాట్లాడుకుంటున్నారు. నిజమే, ఈ సినిమాలోని కాస్టింగ్ కూడా అదే రేంజులో వుంది. హీరోయిన్లుగా బాలీవుడ్ నుంచి దీపికా పదుకొనె, దిశా పటానీలను తీసుకొచ్చారు.
ఆల్రెడీ కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రబాస్ గెటప్, ‘సైరా నరసింహారెడ్డి’లోని చిరంజీవి గెటప్‌ని పోలి వుంటుందని అంటున్నారు. అందుకు సంబంధించి ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
కాగా, ఇటీవల దీపికా పదుకొనె హెల్త్ ఇష్యూతో హాస్సిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ ఆగిపోయిందన్న వార్తలు వినిపించాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని షూటింగ్ ఎటువంటి అడ్డంకి లేకుండా జరుగుతోందనీ చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.టైమ్ మిషన్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంగా ‘ప్రాజెక్ట్ కె’ రూపొందుతోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







