‘ప్రాజెక్ట్ కె’‌లో ప్రబాస్ గెటప్ అదేనా.?

- June 23, 2022 , by Maagulf
‘ప్రాజెక్ట్ కె’‌లో ప్రబాస్ గెటప్ అదేనా.?

ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి ‘ప్రాజెక్ట్ కె’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
తెలుగు సినిమాపై ఇదో విజువల్ వండర్ కానుందని ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ ఎత్తున మాట్లాడుకుంటున్నారు. నిజమే, ఈ సినిమాలోని కాస్టింగ్ కూడా అదే రేంజులో వుంది. హీరోయిన్లుగా బాలీవుడ్ నుంచి దీపికా పదుకొనె, దిశా పటానీలను తీసుకొచ్చారు.
ఆల్రెడీ కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించి ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రబాస్ గెటప్, ‘సైరా నరసింహారెడ్డి’లోని చిరంజీవి గెటప్‌ని పోలి వుంటుందని అంటున్నారు. అందుకు సంబంధించి ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

కాగా, ఇటీవల దీపికా పదుకొనె హెల్త్ ఇష్యూతో హాస్సిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ ఆగిపోయిందన్న వార్తలు వినిపించాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని షూటింగ్ ఎటువంటి అడ్డంకి లేకుండా జరుగుతోందనీ చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.టైమ్ మిషన్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంగా ‘ప్రాజెక్ట్ కె’ రూపొందుతోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com