సల్మాన్‌తో స్పెషల్ సాంగ్: మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’కి ఎక్స్‌ట్రా గ్లామర్.!
- June 23, 2022
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ షూటింగులో కూడా పాల్గొనడం జరిగింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ రోల్ చాలా విబిన్నంగా వుండబోతోందట.
వాస్తవానికి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఒరిజినల్‌లో లేని స్పెషల్ ఎట్రాక్షన్స్ ఎన్నో మిక్స్ చేశారట. అందులో భాగంగానే, సల్మాన్ ఖాన్ మీద ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఆ సాంగ్ విజువల్‌గా చాలా ప్రత్యేకంగా వుండబోతోందట.
700 మంది డాన్సర్లతో ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నారట. అయితే, ఈ సాంగ్ కేవలం సల్మాన్ ఖాన్ పైనే వుంటుందా.? లేక, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సాంగ్‌లో కనిపిస్తారా.? లేదా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక ఈ సినిమాని బాలీవుడ్‌లో స్పెషల్‌గా ప్రమోట్ చేసేందుకు సల్మాన్ ఖాన్ కంకణం కట్టుకున్నాడట.అక్కడి ప్రమోషన్ బాధ్యతలన్నీ సల్లూ భాయ్ తనపైనే వేసుకున్నాడనీ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి జయం రాజా దర్శకత్వం వహిస్తున్నారు.నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







