మహేష్ సినిమాలో ఆ సీనియర్ నటులు: త్రివిక్రమ్ ప్లానింగ్ ఏంటో.!
- June 23, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ మంచి హిట్ అందుకుంది. డైలాగ్స్ పరంగా మహేష్‌బాబుని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లిపోయాడు త్రివిక్రమ్ ఈ సినిమాతో.
‘ఖలేజా’ వచ్చి పదేళ్లు దాటుతున్నా ఇంతవరకూ మళ్లీ సెట్ కాని ఈ కాంబినేషన్ ఎట్టకేలకు ఇప్పుడు ఇలా సెట్ అయ్యింది. రీసెంట్‌గా ‘సర్కారు వారి పాట’ సినిమాతో హిట్ కొట్టి, ఫుల్ జోష్ మీదున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో ఇంకో హిట్ పక్కాగా కొట్టేస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా వున్నారు.
ఇదిలా వుంటే, ఈ సినిమాకి భారీ రేంజ్‌లో క్యాస్టింగ్ ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. విజయ్ సేతుపతి కానీ, ఫహాద్ ఫాజిల్‌ని కానీ, విలన్‌గా తీసుకునేందుకు మంతనాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.
తాజాగా మరో స్టన్నింగ్ క్యారెక్టర్ కోసం సీనియర్ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబును ఎంగేజ్ చేసే యోచనలో త్రివిక్రమ్ అండ్ టీమ్ వున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ నటి శోభన కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించనుందని ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ సినిమాల్లో ఓ సీనియర్ నటికి ఎప్పుడూ ఖచ్చితంగా ప్లేస్ వుంటుంది. అలాగే ఆ పాత్రకి ఇంపార్టెన్స్ కూడా ఎక్కువే. నదియా, టబు తరహాలో శోభన కూడా ఈ సినిమాతో తెలుగులో మళ్లీ పాపులర్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







