డేటా చోరికి హ్యాకర్ విఫలయత్నం..!

- June 24, 2022 , by Maagulf
డేటా చోరికి హ్యాకర్ విఫలయత్నం..!

కువైట్ సిటీ: కువైట్ ఎయిర్ వేస్ కార్పొరేషన్ సంబంధించిన వెబ్సైట్ లో ఉన్న కీలకమైన డేటా ను చోరీ చేసేందుకు హ్యాకర్ ప్రయత్నాలను విఫలయత్నం చేయడమే కాకుండా వెబ్సైట్ ను తిరిగి 2 గంటల్లోనే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఎయిర్ వేస్ ఉన్నతాధికారి తెలిపారు. 

స్థానిక పత్రికల కథనం ప్రకారం ఎయిర్ వెస్ సంబంధించిన వెబ్సైట్ లోని కీలకమైన సమాచారం లీక్ అయ్యిందని తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టడంతో పాటుగా సమాచార భద్రతా పటిష్టం అయ్యింది. అలాగే, ప్రయాణికుల యొక్క సమాచారం చాలా సురక్షితంగా ఉందని ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలియజేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com