ప్రభాస్ కోసం విలన్‌గా మారతానంటోన్న హీరో.!
- June 25, 2022
ప్రభాస్, గోపీచంద్ కలిసి ‘వర్షం’ సినిమాలో నటించారు. హీరోగా ప్రబాస్‌కీ, విలన్‌గా గోపీచంద్‌కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత గోపీచంద్ హీరోగా సెటిలైపోయాడు. విలన్‌గా నటించే సాహసం చేయలేదు వేరే హీరోకి.
‘గౌతమ్ నందా’ సినిమాలో గోపీచంద్ సెల్ఫ్ విలనిజం చూపించిన సంగతి తెలిసిందే. అదేంనండీ గోపీచంద్ డబుల్ రోల్లో రూపొందిన ఈ సినిమాలో తనకు తానే విలన్‌గా నటించాడు గోపీచంద్. కాగా, చాలా కాలంగా గోపీచంద్ విలనిజంపై కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ మధ్య హీరోగా కలిసి రావడం లేదు గోపీచంద్‌కి.
దాంతో రూటు మార్చేసి, విలన్‌గా ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడట గోపీచంద్.. అంటూ ప్రచారం జరిగింది. కానీ, అందుకు సిట్యువేషన్స్ కరెక్టుగా సెట్ కాలేదేమో బహుశా. ఆ తరహా ప్రాజెక్టులేమీ గోపీచంద్ చెంతకు రాలేదట.
తాజాగా గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే, ప్రబాస్‌తో తన విలనిజం గురించిన ముచ్చట్లు కూడా సోదిలోకి వచ్చాయి.
‘ప్రభాస్, నేనూ మంచి స్నేహితులం. అప్పుడప్పుడూ ఫ్రెండ్లీగా కలుస్తూనే వుంటాం. ఆ స్నేహంతోనే, ప్రబాస్ అడిగితే, ఆయన కోసం మళ్లీ విలన్‌గా మారడానికి నేను సిద్ధం..’ అంటూ గోపీచంద్ సెలవిచ్చారు. ప్రస్తుతం ప్రబాస్ ప్యాన్ ఇండియా రేంజ్ హీరో. ఏమో, భవిష్యత్తులో ప్రభాస్, గోపీచంద్ కాంబినేషన్ మళ్లీ సెట్టవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







