వెంకీతో శ్రీకాంత్ అడ్డాల: ముచ్చటగా మూడోస్సారి

- June 25, 2022 , by Maagulf
వెంకీతో శ్రీకాంత్ అడ్డాల: ముచ్చటగా మూడోస్సారి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్ర్కీన్ పైకి తీసుకొచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులను ఆన్ స్క్రీన్ అన్నదమ్ములుగా మార్చేసి, బ్లాక్ బాస్టర్ మల్టీ స్టారర్ హిట్ కొట్టేశారు శ్రీకాంత్ అడ్డాల.

ఆ తర్వాత మహేష్‌తో ‘బ్రహ్మోత్సవం’ సినిమా తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల దారుణంగా ఫెయిలయ్యారు. కానీ, వెంకటేష్‌తో ‘నారప్ప’ అనే సీరియస్ మూవీని తెరకెక్కించి హిట్ కొట్టారు. అదీ కరోనా ప్యాండమిక్ టైమ్‌లో ఓటీటీ రిలీజ్ ఇచ్చి మరీ సెన్సేషనల్ అయ్యారు శ్రీకాంత్ అడ్డాల.

తాజాగా ఈ డైరెక్టర్ మరో మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సారి కూడా ఈయన వెంకీనే తన సినిమాలో హీరోగా ఎంచుకున్నారు. ఇంకో హీరోగా మాస్ రాజా రవితేజను సెలెక్ట్ చేసుకున్నారట. వెంకీ, రవితేజ కొత్త కాంబోలో ఈ ప్రాజెక్ట్ రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

ఇంకా అధికారికంగా ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు కానీ, త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయట. ఒకవేళ ప్లానింగ్ సెట్ అయ్యి, ప్రాజెక్ట్ ఓకే అయితే, వెంకీతో శ్రీకాంత్ అడ్డాలకి ఇది మూడో సినిమా అవుతుంది. రీసెంట్‌గా వెంకటేష్ ‘ఎఫ్ 3’ సినిమాతో హిట్ కొట్టి జోష్ మీదున్న సంగతి తెలిసిందే. అలాగే, రవితేజ.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com