ఏపీఎన్ఆర్టీఎస్ కువైట్ వారి సహకారంతో స్వస్థలానికి ఏపీ వాసి

- June 25, 2022 , by Maagulf
ఏపీఎన్ఆర్టీఎస్ కువైట్ వారి సహకారంతో స్వస్థలానికి ఏపీ వాసి

కువైట్: తూర్పు గోదావరి జిల్లా, అప్పన్న పల్లి గ్రామ పంచాయతీ మామిడి కుదురు నివాసి కుసుమా రాంబాబు అను అతను గత 10  సంవత్సరాల క్రితం  జీవనోపాధి కోసం కువైట్ కు వచ్చి ఒక ప్రైవేటు కంపెనీ లో పని  చేసుకుంటూ జీవనం సాగించేవాడు.10 సంవత్సరాలు వరకు స్వదేశానికి పోలేక సరైన పని దొరకకా కువైట్ లో చాల ఇబ్బందులకు గురైనాడు. గత పది సంవత్సరాల నుంచి ఇంటికి పోని కారణంగా అతని భార్య తన భర్త ను ఇండియా కు రప్పించాలని పోలీసులను ఆశ్రయించి అతని తల్లిదండ్రుల పైన కేసు పెట్టినది. పోలీసులు ఆమెను సముదాయించి తన భర్తను స్వదేశానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ వారి ద్వారా , ఏపిఎన్ఆర్టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ (కువైట్) నాయిని మహేశ్వర రెడ్డి కి తెలుపగా వెంటనే స్పందించి అతనికి  అకామా లేని కారణంగా  వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెఢ్డి సహకారంతో  కువైట్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి సంబంధిత పేపర్ వర్కు పనులు పూర్తి చేయించి అవుట్ పాస్పోర్టు తయారు చేసి క్షేమంగా ఇండియాకు పంపే ఏర్పాటు చేసారు. 

ఈ సందర్బంగా కుసుమా రాంబాబు మాట్లాడుతూ తనకు సహాయ సహకారాలు అందించిన కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు, వైఎస్సార్సిపీ కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి, ఏపీఎన్ఆర్టిఎస్ రీజనల్ కోఆర్డినేటర్ నాయిని మహేశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ ముఖ్య మంత్రి, వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి, ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్  మేడపాటి వెంకట్, సిఇఓ కె.దినేష్ కుమార్, డైరక్టర్ బి.హెచ్ ఇలియాస్ కి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమములో  కువైట్  వైఎస్ఆర్సిపి నాయకులు, మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, పులపుత్తూర్ సురేష్ రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆరవ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి.కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com