పిల్లలకు వ్యాక్సినేషన్.. నిరాకరించిన తల్లిదండ్రులపై చర్యలు
- June 27, 2022
బహ్రెయిన్: కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సినేషన్ నిరాకరించారు. తమ పిల్లలకు వ్యాక్సినేషన్ నిరాకరించడం వల్ల కొంతమంది తల్లిదండ్రులను అధికారులు బహ్రెయిన్‌లోని డాక్లో దింపారు. మరోపక్క నేషనల్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌కు సంబంధించిన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఆయా పిల్లల తల్లిదండ్రులు విచారణను ఎదుర్కొంటున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. స్థానిక ఆరోగ్య క్లినిక్‌ల ద్వారా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని, అనేక ప్రయత్నాలు చేసినా వారు నిరాకరించారని.. అంతిమంగా వారిపై చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ చర్యల తీవ్రత, పర్యవసానాలను గురించి హెచ్చరించడానికి తల్లిదండ్రులను పిలిపించినట్లు అధికారులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమానికి కట్టుబడి ఉండాలని, చట్టపరమైన చర్యలను నివారించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం