సౌదీలో సెమిస్టర్ పరీక్షలు.. 5 మిలియన్ల స్టూడెంట్స్ హాజరు
- June 27, 2022
రియాద్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1443 AH సంవత్సరం మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు దాదాపు 4,980,229 మంది విద్యార్థు హాజరవుతున్నారు. ఇవి వచ్చే బుధవారం వరకు కొనసాగనున్నాయి. విద్యా మంత్రిత్వ శాఖా అధికారులు పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలల పాఠ్యాంశాలను సమీక్షించడానికి, వివిధ విభాగాలకు సమగ్ర మానసిక ప్రణాళికలను రూపొందించడానికి టైమ్‌టేబుల్‌ను తయారు చేయడంతో సహా, చివరి పరీక్షలకు బాగా సిద్ధం కావడానికి విద్యార్థులకు చిట్కాలు, సూచనలను "ట్విటర్"లో మంత్రిత్వ శాఖ అందుబాటులో పెట్టింది. తగినంత నిద్ర పోవాలని, ఒత్తిడికి గురికావద్దని, పాఠ్యాంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, ప్రతి పాఠానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి రివిజన్ చేయాలని విద్యార్థులకు మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







