పని ప్రమాదాల్లో తగ్గుదల
- June 13, 2015
ఖతార్‌లో గడచిన కొన్నేళ్ళలో ‘పని ప్రమాదాలు’ తగ్గుముఖం పట్టినట్లు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. పని చేస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ప్రమాదాలు నివారించగలుగుతామనీ, ఆ జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన పెంచడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విజయం సాధించిందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ షేక్ మహమ్మద్ బిన్ హమాద్ అలీ తని చెప్పారు. భవన నిర్మాణాల్లోనూ, ఇతర సంస్థల్లోనూ కార్మికుల భద్రతే ధ్యేయంగా పలు నిబంధనల్ని ప్రభుత్వం అమలు చేయడం వల్లే పని ప్రమాదాల్ని నివారించగలిగామని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా గడచిన కొన్నేళ్ళలో గణనీయంగా తగ్గాయి. లక్షలో 26 మంది 2006లో చనిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 9కి తగ్గడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.
--వి.రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







