ఘనంగా జరిగిన 'బాహుబలి' ఆడియో వేడుకలు

- June 13, 2015 , by Maagulf
ఘనంగా జరిగిన 'బాహుబలి'  ఆడియో వేడుకలు

అంబరాన్నంటిన ఆడియో ఆవిష్కరణ వేడుక ప్రజాశక్తి - తిరుపతి సిటి వేలాది మంది అభిమానులు.. అతిరథమహరథుల మధ్య భారీ బడ్జెట్‌తో రూపొందించిన బాహుబలి చిత్రం ఆడియో ఆవిష్కరణను శనివారం రాత్రి తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. ప్రతి చిత్రం లాగానే రాజమౌళి మార్కు కొట్టొచ్చినట్లు కనిపించే విధంగా ప్రముఖుల చేతుల మీదగా కాకుండా ప్రేక్షకులచేత వినూత్న రీతిలో ఆడియోను విడుదల చేశారు. ప్రముఖ యాంకర్‌ సుమ యాంకరింగ్‌లో లహరీ ఆడియో సంస్థ ఆధ్వర్యంలో బాహుబలి చిత్రయూనిట్‌ సమక్షంలో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ముంగిట ప్రభాస్‌ అభిమానులు 20 నుంచి కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఒకటో నెంబర్‌ రాగానే అభిమానులందరూ ఒక్కసారిగా బాహుబలి అని గట్టిగా కేకలు వేయడంతో ఆడియో విడుదలైనట్లు చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై సాయంత్రం ఐదు గంటల నుంచి జూనియర్‌ గాయకులు, సంగీత దర్శకుడు కీరవాణి శిష్యబృందం ప్రభాస్‌, అనుష్క, తమన్న, రాణా, రమ్యకృష్ణ నటించిన చిత్రాల పాటలను పాడి వినిపించారు. అనంతరం చిత్రంలో నటించిన తారాగణాన్ని వారి పాత్రలను, చిత్ర నిర్మాణానికి కృషి చేసిన వివిధ రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రేక్షకులు ఎప్పడెప్పడా అని ఎదురుచూస్తున్న చిత్ర విడుదలను అభిమానుల కేరింతల మద్య జూల్‌ 10గా హీరో ప్రభాస్‌ ప్రకటించడంతో అభిమానులు ఈల, చప్పట్లతో స్టేడియం మారుమ్రోగింది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. చిత్రానికి ఫుల్‌ ఎనర్జి రమ్యకృష్ణ పాత్ర శివగామని అని, సుమారు మూడు సంవత్సరాల పాటు షూటింగ్‌ జరిగినా నటీనటులందరూ తనకు ఎంతగానో సహకరించారన్నారు. ఈ చిత్రంలోని దేవసేన పాత్రను అనుష్క తప్ప వేరెవ్వరు చేయలేరనే విధంగా ఆమె నటించిందన్నారు. చిత్ర హీరో ప్రభాష్‌ మాట్లాడుతూ.. చత్రపతి నుంచి తనతో భారీ చిత్రాన్ని తీయాలని రాజమౌళి భావించారని, హాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆయన బాహుబలిని తీర్చిదిద్దారని కొనియాడారు. విడుదల ఆలస్యమైన ప్రతి ఒకర్ని ఖచ్చితంగా ఈ చిత్రం మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, తమన్న, అనుష్క, రమ్యకృష్ణ, ఎంఎం.కీరవాణి, కృష్ణమరాజు, నిర్మాత దేవీప్రసాద్‌, నాజర్‌, సత్యరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com