'ఎజాదా'ను ప్రారంభించిన దుబాయ్ హెల్త్ అథారిటీ
- June 28, 2022
దుబాయ్: ఎమిరేట్‌లో మొట్టమొదటిసారిగా విలువ-ఆధారిత ఆరోగ్య సంరక్షణ మోడల్ అయిన "EJADAH" కార్యక్రమాన్ని దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) ప్రారంభించింది. వాల్యూ-బేస్డ్ హెల్త్ కేర్ మోడల్ రోగులకు సంబంధించిన పనితీరు, ఫలితాల కోసం ఇది పనిచేయనుంది. అలాగే అన్ని వ్యాధులకు చికిత్స ప్రోటోకాల్‌లకు సంబంధించి వైద్యులందరూ అనుసరించాల్సిన ఫ్రేమ్‌వర్క్, మార్గదర్శకాలతో హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్లకు సహాయంగా నిలుస్తుందని DHA డైరెక్టర్ జనరల్ అవద్ సెఘాయెర్ అల్ కేత్బీ ఈవెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలకు అనుగుణంగా ఆరోగ్య రంగం అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి విధానాలు, నిబంధనలను అమలు చేస్తోందన్నారు. దుబాయ్‌లో ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ఎమిరేట్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా మారేందుకు ఇది దోహదపడుతుందన్నారు. EJADAH ద్వారా బీమా చెల్లింపుదారులు, ప్రొవైడర్లు ఫ్రేమ్‌వర్క్, KPIలను అర్థం చేసుకోవడానికి శిక్షణ పొందుతారన్నారు. ఇది వేగవంతమైన మెడికల్ క్లెయిమ్ ఆమోదాలకు సాయంగా ఉంటుందని, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల వృధాను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







