నకిలీ అదాహీ కూపన్ల విక్రయం.. నలుగురు విదేశీయులు అరెస్టు
- June 28, 2022
మక్కా: అదాహి (బలి ఇచ్చే జంతువుల వినియోగానికి సౌదీ ప్రాజెక్ట్) నకిలీ కూపన్‌లను విక్రయించడం ద్వారా హజ్ యాత్రికులను మోసం చేయడానికి ప్రయత్నించినందుకు ముగ్గురు నివాసితులు, ఒక యెమెన్ సందర్శకుడిని మక్కాలోని పోలీసులు అరెస్టు చేశారు. విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన యెమెన్ దేశస్థుడితో పాటు ముగ్గురు ప్రవాసులు అక్రమంగా అదాహీ కూపన్ల విక్రయం కోసం నకిలీ సంస్థ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు గుర్తించారు. తక్కువ ధరకు ఇస్తున్న నకిలీ కూపన్లను కొనుగోలు చేసేలా హజ్ యాత్రికులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







