‘డీజె టిల్లు’ సీక్వెల్ కోసం స్టార్ హీరోయిన్.?
- June 28, 2022
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజె టిల్లు’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి, ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టిన బడ్జెట్‌కి మించి లాభాలు సాధించింది ఈ సినిమా. చిన్న సినిమాల్లో పెద్ద విజయం అందుకుంది. యూత్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ.
అదే ఉత్సాహంతో, ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశాడు. ఆల్రెడీ సీక్వెల్ కోసం సినిమాలో లీకు కూడా వదిలిన సంగతి తెలిసిందే. సీక్వెల్ కోసం స్టోరీ ఇలా వుండబోతోందట. అలా వుండబోతోందట.. అంటూ కొన్ని కథలూ, కథనాలూ ప్రచారంలో వున్న సంగతి కూడా తెలిసిందే. మొదటి పార్ట్‌లో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, సెకండ్ పార్ట్ కోసం, స్టార్‌డమ్ వున్న హీరోయిన్ కోసం వెతుకులాట మొదలెట్టారట. అంటే, ఇంకాస్త అదనపు గ్లామర్ అద్దబోతున్నారన్న మాట. అంతేకాదు, బడ్జెట్ విషయంలోనూ కాస్త ‘బిగ్’ ఆలోచనలే చేస్తున్నారట. ఈ సినిమాలో ఎక్కువ పార్ట్ విదేశాల్లో చిత్రీకరించనున్నారట. సో, ఆటోమెటిగ్గా ఖర్చు పెరగుతుంది.
ఇక, స్టార్ హీరోయిన్ అంటే.. కాజల్, సమంత, పూజా హెగ్దే, రష్మిక వంటి ముద్దుగుమ్మలతో సంప్రదింపులు జరుగుతున్నాయా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. అయితే, ఈ భామలు స్పెషల్ సాంగ్‌కి అయితే ఓకే అంటారు. కానీ, ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా సిద్దుకి జోడీగా నటిస్తారా.? అంటే ఎందుకు నటించరు. రెమ్యునరేషన్ ఆ రేంజ్‌లో తీసుకుంటారంతే.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







