‘పుష్ప’ సీక్వెల్ ఇప్పట్లో లేనట్టేనా.?
- June 28, 2022
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయబోతున్నామంటూ మొదట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రెండు పార్టులకి సంబంధించిన షూటింగ్ మాత్రం అప్పుడే కంప్లీట్ అయిపోయిందట.
కానీ, ‘పుష్ప’ మొదటి పార్ట్‌కి వచ్చిన రెస్పాన్స్ కారణంగా, అంతకు మించి అవుట్ పుట్ ఇవ్వాలన్న వుద్దేశ్యంతో రెండో పార్టుకి చెక్కడం మరింత ఎక్కువైందట. అయితే, ఆ చెక్కుడు విషయంలో ఎందుకో సుకుమార్ అండ్ టీమ్ అంత సంతృప్తికరంగా లేకపోవడంతో, మరింత పాలిష్ మీద పాలిషింగ్‌లు జరుగుతున్నాయట.
అలా, ఎప్పుడో సెట్స్ మీదికి వెళ్లాల్సిన ‘పుష్ప’ రెండో పార్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్‌లోనైనా షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఇప్పట్లో ‘పుష్ప’ సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలే కనిపించడం లేదట.
సో, ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది ప్రధమార్ధంలో కానీ, ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదే లే. వచ్చే ఏడాది ‘పుష్ప’ రెండో పార్ట్ పట్టాలెక్కితేనే గొప్ప. అంటే, ఇప్పట్లో ‘పుష్ప 2’ కు ముహూర్తం కుదిరేదే లే.. అన్నమాట.
మరి, ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ ఏం చేస్తాడు.? వేరే ఏదైనా ప్రాజెక్ట్ ఓకే చేసి, సెట్స్ మీదికి తీసుకెళతాడా.? లేక మళ్లీ గ్యాప్ తీసుకుంటాడా.? అనేది వేచి చూడాలి మరి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







