ఉక్రెయిన్‌లో క్షిపణి దాడి.. 16 మంది మృతి
- June 28, 2022
కీవ్ : ఉక్రెయిన్‌లోని సెంట్రల్ సిటీ క్రెమెన్‌చుక్‌లోని ఓ షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో 16 మంది మృత్యువాతపడ్డారు. మరో 59 మంది గాయపడ్డట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల అధిపతి సెర్గి క్రుక్ మంగళవారం వేకువ జామున ప్రకటించారు. షాపింగ్ మాల్‌పై మిస్సైల్ దాడి అనంతరం రెస్క్యూ పనులు, శిథిలాల తొలగింపు, మంటలను ఆర్పివేసే ప్రధాన పనులు కొనసాగుతున్నాయన్నారు. మిస్సైల్ దాడి సమయంలో మాల్‌లో వెయ్యి మందికిపైగా పౌరులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు.
మంటలతో ఫైటర్లు పోరాడుతున్నారని, బాధితుల సంఖ్యను ఊహించలేమని జెలెన్‌స్కీ ఫేస్‌బుక్‌లో పేర్కొన్న ఆయన.. ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే, రష్యా క్షిపణి దాడిని నగర మేయర్ విటాలి మాలెట్‌స్కీ ఖండించారు. పౌర జనాభాపై విరక్తికరమైన తీవ్రవాద అచర్య అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మరిన్ని భారీ ఆయుధాలను సరఫరా చేయాలని, రష్యాపై ఆంక్షలు విధించాలని మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. రష్యా మానవాళికి అవమానకరం, అది పర్యావసరాలను ఎదుర్కొవాలన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..