సామాజిక మాధ్యమాల్లో హత్యా వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం నేరం
- June 30, 2022
షార్జా: శుక్రవారం నాడు షార్జాలో హత్యకు గురైన మహిళ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తి కోసం షార్జా పోలీసులు గాలిస్తన్నారు.హత్య చేసిన నిందితుడిని రెండు గంటల్లోనే పట్టుకున్న పోలీసులకు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ వీడియోలు పెద్ద తలనొప్పిగా మారాయి.
అలాగే, ప్రజలను ఉద్దేశించి షార్జా పోలీసులు మాట్లాడుతూ హత్యకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నవారు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు చేసే ఈ పైశాచిక చర్యల కారణంగా బాధితురాలి కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోతోంది.యూఏఈ సైబర్ నేరాల చట్టంలోని ఆర్టికల్ 44 ప్రకారం హతురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తూ ఉన్నాము. అందుకు తగ్గట్టుగానే భాద్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం షార్జా పోలీసులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన నిందితుడిని పట్టుకునేందుకు సీసీ టీవి పుటేజీల ఆధారంగా చేసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!







