భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
- July 01, 2022
ఏపీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు గోదావరి జిల్లాలో ముస్తాబు అవుతున్నాయి. ముఖ్యంగా భీమవరంలో అల్లూరి జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా రెడీ అవుతున్నాయి. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరంలో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ వేడుకలలో భాగంగా భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది. 15 టన్నుల బరువున్న ఈ కాంస్య విగ్రహాన్ని పట్టణంలోని 34వ వార్డు ఏఎస్‌ఆర్ నగర్‌లోని మునిసిపల్ పార్కులో ఏర్పాటు చేస్తున్నారు.
దాదాపు రూ.3 కోట్లతో 15 టన్నుల బరువు గల అల్లూరి విగ్రహాన్ని పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు. అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్‌ను అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవికి కూడా భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







