మంచు వారి ఫ్యామిలీ సినిమా: ఈ సారి కొంచెం విభిన్నంగా.!
- July 01, 2022
మొన్న ‘సన్నాఫ్ ఇండియా’ అంటూ కొడుకు విష్ణు వర్ణన్‌తో కలిసి సినిమా చేశారు సీనియర్ నటులు మోహన్ బాబు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అదే ‘అగ్ని నక్షత్రం’. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
పోలీస్ వాహనం సైరన్ కొడుతూ వెళుతుంటే, బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ ఆన్ అవుతుంది. అప్పుడే టైటిల్ అనౌన్స్ అవుతుంది. డిఫరెంట్‌గా టైటిల్ అనౌన్స్‌మెంట్ ప్లాన్ చేశారు. కథ, కాకరకాయ ఎలా వుండబోతోందో తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాలి.
ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మంచు లక్ష్మి నటిస్తూ నిర్మించడం విశేషం. కాగా గతంలో ‘దొంగాట’, ‘గుండెల్లో గోదారి’, ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా..’ తదితర సినిమాలతో నటిగా నిరూపించుకున్న మంచు లక్ష్మి ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగా వున్నారు.
ఓటీటీ వేదికగా కొన్ని రియాల్టీ షోలతో బిజీగా గడుపుతున్న మంచు లక్ష్మి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు.అందుకు చాలా హ్యాపీగా వుందనీ, అదీ, నాన్నతో కలిసి సినిమా చేయడం ఇంకా సంతోషంగా వుందని ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన సంతోషాన్నిసోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.ఈ సినిమా విజయవంతం కావాలని.. అందుకు మీ ఆశీర్వాదం కావాలని ఫ్యాన్స్‌నుద్దేశించి మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







