సాయి పల్లవి ఇంకా మర్చిపోలేకపోతోందట.!
- July 01, 2022
లేడీ పవర్ స్టార్‌గా ఫ్యాన్స్‌తో ప్రశంసలు దక్కించుకుంటోంది అందాల భామ సాయి పల్లవి. నిజమే, ఆ ప్రశంసలకు సాయి పల్లవి అర్హురాలే. ఎందుకంటే, సాయి పల్లవి ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంటుంది. ఆ పాత్ర తీరు తెన్నులను చాలా కాలం ఆమె బాడీ లాంగ్వేజ్ నుంచి పోగొట్టుకోదు.
మొన్న ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాలో దేవదాసి పాత్ర పోషించింది సాయి పల్లవి. ఆ పాత్ర తాలూకు ఛాయల్లోనే చాలా కాలం వుండిపోయింది. ప్రమోషన్లలో ఆ పాత్ర ఛాయల్ని మిళితం చేసి కనిపించేది. ఇప్పుడు ‘విరాట పర్వం’ సినిమాలో వెన్నెల పాత్ర తాలూకు జ్ఞాపకాల్ని ఇంకా మర్చిపోలేకపోతోందట సాయి పల్లవి.
‘విరాట పర్వం’ సినిమాని సాయ పల్లవి వైపు నుంచే ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు, తర్వాత కూడా ఈ సినిమా వివాదాలు వెంటాడాయి. కానీ, సినిమా ధియేటర్లో ఫెయిలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది ‘విరాట పర్వం’.
ఈ సందర్భంగా ఓటీటీలో తన సినిమాని తప్పకుండా చూడండి.. అంటూ సాయి పల్లవి తన ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌కి సూచించింది. అలాగే, వెన్నెల పాత్రను తాను ఎప్పటికీ మర్చపోలేననీ అంత గొప్ప పాత్రలో నటించడం తన అదృష్టం అనీ, ఆ అదృష్టానికి కారణం రానా, డైరెక్టర్ వేణు ఉడుగుల.. వాళ్లకి తానెప్పుడూ రుణపడి వుంటానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







