వేసవిలో ఫుడ్ డెలివరీ.. మోటార్‌సైకిళ్లకు బదులుగా కార్లు
- July 02, 2022
దోహా: ఖతార్‌లోని ఫుడ్ డెలివరీ సర్వీస్ కంపెనీలు వేసవి కాలంలో మోటార్‌సైకిళ్లకు బదులుగా కారు ద్వారా వినియోగదారులకు ఆర్డర్‌లను డెలివరీ చేయడం ప్రారంభించాయి. దేశంలో వేసవి నెలల్లో డెలివరీ రైడర్‌లు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కార్లను మాత్రమే ఉపయోగించుకునేలా నిబంధన విధించారు. ఇది జూలై 1 నుండి అమలులోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2022 వరకు అమల్లో ఉంటుంది. ఖతార్‌లోని అనేక ఫుడ్ డెలివరీ కంపెనీలు సోషల్ మీడియాలో ఈ చర్యను స్వాగతించాయి. జూన్ 1 నుండి సెప్టెంబరు 15 వరకు బహిరంగ ప్రదేశాల్లో చట్టబద్ధమైన పని గంటలను పొడిగించిన 2021 నాటి మినిస్టీరియల్ డిక్రీ నెం. 17కు అనుగుణంగా తాజా చర్యలను తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







