మదీనాకు చేరుకున్న 344,000 మంది హజ్ యాత్రికులు
- July 02, 2022
మదీనా: ఈ సంవత్సరం హజ్ చేయడానికి అనేక దేశాల నుండి మొత్తం 344,881 మంది యాత్రికులు మదీనాకు చేరుకున్నారు. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ జారీ యాత్రికుల వివరాలను వెల్లడించింది. మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఇప్పటివరకు 278,751 మంది యాత్రికులు చేరుకున్నారని, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా 49,806 మంది యాత్రికులు వచ్చినట్లు పేర్కొంది. మదీనాలో ఉంటున్న యాత్రికుల జాతీయతలను కూడా వెల్లడించారు. బంగ్లాదేశ్ యాత్రికులు మదీనాలో 12,411 మందితో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థానీయులు 8,229, భారతీయులు 6,595, ఇరానియన్లు 6,433, మరియు నైజీరియన్లు 6,320 మంది ఉన్నారు. మక్కాలోని పవిత్ర స్థలాలకు వెళ్లే మార్గంలో గత కొన్ని రోజులుగా 265,130 మంది యాత్రికులు మదీనా నుండి బయలుదేరి వెళ్లగా.. 79,451 మంది యాత్రికులు మదీనాలో ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







