'తెలుగు స్రవంతి' ఉగాది వేడుకలు - 2016

- April 11, 2016 , by Maagulf


దుబాయ్‌లో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు-2016 అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు స్రవంతి ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. దుబాయ్‌లోని న్యూ వరల్డ్‌ ప్రైవేట్‌ స్కూల్‌ ఆడిటోరియంలో శుక్రవారం, అనగా ఏప్రిల్‌ 8న ఈ వేడుకలు జరిగాయి. ఉగాది వేడుకల కోసం అద్భుతమైన రీతిలో అలంకరణ జరిగింది. రకరకాల పువ్వులు, ఇతరత్రా డెకరేషన్‌ ఐటమ్స్‌తో వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆహూతులకు సంప్రదాయ పద్ధతిలో తాంబూలాన్ని అందించి ఆహ్వానం పలికారు. అలాగే వచ్చినవారందరికీ ఉగాది పచ్చడిని అందించారు. తెలుగు సినీ కథనాయిక అర్చన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రముఖ ఆస్ట్రాలజర్‌ శ్రీ శనకమంచి రామకృష్ణ శాస్త్రిగారి పంచాంగ పఠనం ఈ కార్యక్రమానికి హైలైట్‌గా చెప్పవచ్చు. ఈ ఏడాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో శాస్త్రిగారు వివరించి చెప్పారు. తెలుగు స్రవంతి అధ్యక్షురాలు లక్ష్మిరెడ్డి, ప్రెసిడెన్షియల్‌ ఎడ్రస్‌ నిర్వహించారు. ప్రతి సంవత్సరం తెలుగు స్రవంతి యూఏఈలోని ఆయా రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించినవారిని సన్మానిస్తూ వస్తోంది. ఈసారి ఉగాది సన్మాన్‌ పురస్కారం దువ్వూరు కిషోర్‌బాబుకి దక్కింది. జజీరా ఎమిరేట్స్‌ పవర్‌ డైరెక్టర్‌గా ఆయన సాధించిన విజయాలకు, అలాగే యూఏఈలో తెలుగువారిని ఆదుకునేందుకు ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా తెలుగు స్రవంతి అధ్యక్షురాలు లక్ష్మిరెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ దీపికా కిషోర్‌బాబు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ జి. సుధాకర్‌రావు, జాయింట్‌ సెక్రెటరీ కె.సుబ్బారెడ్డి, కల్చరల్‌ సెక్రెటరీస్‌ మాలా గోపీనాథ్‌ మరియు లతా నగేష్‌, కమిటీ సభ్యులు లక్ష్మి పన్యాల, అనిల్‌ గురానా, ప్రసాద్‌ పెండ్యాల, నాగార్జునరావు తదితరులు సిల్క్‌ షాల్‌తో కిషోర్‌బాబుని సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన పత్రం మరియు మెమెంటోను ఆయనకు అందజేశారు. బాలికలు గణేష్‌ ప్రార్ధన చేయగా, కామేశ్వరి మరో గీతాన్ని ఆలపించారు. కుమారి శ్రావణి భరతనాట్యం డాన్స్‌తో అలరించారు. క్లాసికల్‌, సెమి క్లాసికల్‌ డాన్సులు, టాలీవుడ్‌, బాలీవుడ్‌ మాస్ మరియు భగవద్గీత శ్లోకాలతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది. శ్రీలేఖ్యా భామా కలాపం, ప్రీతి తాతంబోట్ల మరియు గ్రూప్‌ చేసిన బాల కనక మాయ చెలా డాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీవీ యాంకర్‌ ఇందు ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహించారు. ఫణి మాధవ్‌ ఆమెతోపాటు కార్యక్రమాన్ని రక్తికట్టించారు. మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్‌ వంటివాటితో ఫణి మాధవ్‌ ఆహూతుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు. తెలుగు స్రవంతి అధ్యక్షురాలు లక్ష్మిరెడ్డి, అర్చనను ఆహ్వానించి, ఆమెను సన్మానించారు. నృత్య ప్రదర్శనతో తమను అలరించమని అర్చనను కోరారు. 1200 మంది ఆహూతులు, అర్చన 'సూపర్‌ మచ్చి..' పాటకు చేసిన డాన్స్‌ని తిలకించారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com