‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్: ఏంటి రౌడీ మరీ ఇలా చేశావ్.!
- July 03, 2022
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్.. అనే క్యాప్షన్‌తో ఈ సినిమాని డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 5న ఈ సినిమా రిలీజ్‌కి స్లాట్ బుక్ చేశారు.
బాలీవుడ్ భామ అనన్యా పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటిస్తోంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది.
అందులో భాగంగానే రీసెంట్గా విజయ్ దేవరకొండ బొమ్మను తన షోల్డర్‌పై టాటూగా వేయించుకున్న యువతి ఇష్యూ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అధికారికంగా ఓ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలోని (న్యూడ్ లుక్) లుక్‌ని పోలి వుంది ఇది. అమీర్ ఖాన్ రేడియో అడ్డం పెట్టుకుంటే, ఇక్కడ రౌడీ ఓ పూల బొకేని అడ్డంగా పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ లుక్‌లో విజయ్‌ని చూసిన వాళ్లంతా షాకవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్రోల్స్ కూడా జరుగుతున్నాయ్.
అయితే, సమంత ఈ లుక్‌కి డిఫరెంట్‌గా స్పందించింది. ‘గట్స్ వున్నోడు విజయ్’ అని సమంత ట్వీటేసింది. అంతే కాదు, ‘రూల్స్ ఫాలో చేయడమూ తెలుసు.. ఆ రూల్స్ ఓవర్ కమ్ చేయడమూ తెలుసు విజయ్‌కి’ అంటూ తన ట్వీట్లో పేర్కొంది సమంత. దాంతో ఇప్పుడీ ట్వీట్ వైరల్ అయ్యింది.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









