గల్ఫ్ దేశాల్లో బంగారం కొనడం చాలా చౌక

- July 03, 2022 , by Maagulf
గల్ఫ్ దేశాల్లో బంగారం కొనడం చాలా చౌక

గల్ఫ్ సహకార సమాఖ్య(GCC)లోని దేశాలు బంగారం కొనడం చాలా చౌక. దీని పై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతర్జాతీయ వ్యవహారాల మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.అహ్మద్ మాట్లాడుతూ బంగారం పై భారత దేశం తాజాగా విధించిన 12.5 శాతం దిగుమతి సుంకం కారణంగా  GCC మరియు భారత దేశంలో బంగారం రేట్లలో భారీగా వ్యత్యాసం వచ్చింది. అందువల్ల భారత దేశం లో కంటే గల్ఫ్ దేశాల్లోనే బంగారం కొనడం చాలా సులవైన వ్యవహారం అని పేర్కొన్నారు. 

గల్ఫ్ దేశాల్లో బంగారం కొనడం ద్వారా 12 నుండి 15 శాతం సొమ్మును అదా చేయొచ్చు. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కూడా ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారుగా కీర్తి గడించిన భారత్ లో బంగారం రేట్లు పెరుగుదలలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది.జూలై 1 నుంచి  భారత దేశంలో నూతనంగా విధించిన బంగారం దిగుమతి సుంకం అమల్లోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com