షార్జా,దుబాయ్ నగరాల్లో పెరిగిన టాక్సీ రేట్లు
- July 03, 2022
యూఏఈ: జూలై నెలలో యూఏఈ వ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు అమల్లోకి రావడంతో షార్జా మరియు దుబాయ్ నగరాల్లో ట్యాక్సీ రేట్లు పెంచడం జరిగింది.
టాక్సీ రేట్ల పెంపు గురించి దుబాయ్ రోడ్లు మరియు రవాణా సంస్థ (RTA) ప్రతినిధి మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా కిలో మీటర్ల లెక్కన టాక్సీ రేట్లు పెంచడం జరిగింది కానీ వీటి పెంపు ద్వారా ఏటువంటి అదనపు భారం ప్రజల మీద పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
షార్జా రోడ్లు మరియు రవాణా సంస్థ (SRTA) ప్రతినిధి బృందం మాట్లాడుతూ ప్రతి నెల యూఏఈ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో ప్రకటించే ఇంధన ధరల మధ్య జరిగే హెచ్చు తగ్గులు కారణంగా టాక్సీ రేట్లలో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని ప్రకటిస్తూనే ట్యాక్సీ దారులు నుంచి అధిక రేట్ల ను వసూలు చేయడం జరిగింది. ఒకవేళ సంస్థ నిర్దేశించిన ధరలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అయితే పెరిగిన ఇంధన ధరల కారణంగా టాక్సీ రేట్లు మాత్రమే పెరిగాయి తప్పించి దుబాయ్ అధ్వర్యంలో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థ మరియు మెట్రో రైళ్ల లో రేట్లను పెంచలేదని ప్రకటించింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లు వసూలు చేసిన ప్రజా రవాణా వ్యవస్థ ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.
టాక్సీ రేట్లను పెంచడంతో ప్రముఖ టాక్సీ బుకింగ్ సంస్థ ఉబర్ సైతం తన రేట్లలో మార్పులు చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







