టీసీఎస్ లో బీటెక్ విద్యార్ధులకు ఇంటర్న్ షిప్!
- July 03, 2022
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్, బీఈ, ఇతర కోర్సులు చదువుతున్నవారు టీసీఎస్‌లో ఇంటర్షిప్ అవకాశాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టీసీఎస్ ప్రతీ ఏటా 200 మంది ఇంటర్న్స్‌కి అవకాశం ఇస్తోంది. బీటెక్, బీఈ చివరి సంవత్సరం చదువుతున్నవారు, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్డీ చదువుతున్నవారు కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ చేయాలనుకుంటే టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయవచ్చు.
ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ నుంచి సైకాలజీ, సోషియాలజీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, గేమ్ డిజైన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ లాంటి సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్, పీహెచ్డీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైనవారు 6 వారాల నుంచి 8 వారాల షార్ట్ ఇంటర్న్‌షిప్, 16 వారాల నుంచి 18 వారాల లాంగ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అవకాశాన్ని బట్టి ఇంటర్న్‌షిప్ వ్యవధినిమార్చుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారాలు సూచించడం, ప్రోటోటైప్ రూపొందించడం, పరిశోధనా పత్రాలను ప్రచురించడం, రీసెర్చ్ ఎగ్జిక్యూషన్, సర్వేలు నిర్వహించి అవకాశాలు, సవాళ్లను గుర్తించడం లాంటి వాటిని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు టీసీఎస్ అధికారిక వెబ్సైట్లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు https://www.tcs.com/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







