గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, గవర్నర్
- July 04, 2022
ఏపీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సోమవారం భీమవరం రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంట్లో భాగంగా ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం బయలుదేరారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రధాని మోడీ తోపాటు ఒకే హెలికాప్టర్లో సీఎం జగన్..గవర్నర్ బిశ్వభూషణ కూడా బయలుదేరారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా భీమవరంలో ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణం దాదాపు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయిందా అన్నట్లు ఏర్పాట్లు ఉన్నాయి. రేవుకాళ్ల మండలం నుంచి భీమవరం వైపు ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (జులై 4,2022) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భీమవరంలో క్షత్రియ సేవాసమితి 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాగా..ఈ కార్యక్రమాలకు వర్షం అంతరాయం కలిగిస్తోంది.గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిని మోడీ, సీఎం జగన్, గవరన్నర్లు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. దాదాపు గంట 15 నిమిషాలు విగ్రహావిష్కరణ, సభ వద్ద ఉంటారు. మరోవైపు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు సినీనటుడు చిరంజీవి చేరుకున్నారు.రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన భీమవరం చేరుకుని అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









