భారత్ కరోనా అప్డేట్
- July 04, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం తెలిపింది. గత 24 గంటల్లో 13,958 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. అదే సమయంలో 24 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో హోం క్వారంటైన్లు/ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 1,13,864కు పెరిగింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.85 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటివరకు 4,28,79,477 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల దేశంలో మొత్తం 5,25,223 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 197,98,21,197 కరోనా వ్యాక్సిన్ డోసులను వాడారు. నిన్న 1,78,383 కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







