ఘోర బ‌స్సు ప్ర‌మాదం.. స్కూల్ విద్యార్థులు స‌హా 16 మంది మృతి

- July 04, 2022 , by Maagulf
ఘోర బ‌స్సు ప్ర‌మాదం.. స్కూల్ విద్యార్థులు స‌హా 16 మంది మృతి

కులూ : హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కుల్లూ జిల్లాలోని నియోలీ-షంషెడ్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బ‌స్సు అక్క‌డి జంగ్లా ప్రాంతంలోని స‌యింజ్ లోయలో అదుపుత‌ప్పి ప‌డిపోయింది.దీంతో పాఠ‌శాల విద్యార్థులు స‌హా 16 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్ర‌మాదంలో మ‌రికొంత‌మందికి గాయాల‌య్యాయి.

వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు అధికారులు తెలిపారు.ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ప్ర‌మాద‌స్థ‌లి వ‌ద్ద‌ పోలీసులు, స్థానికులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. ప్ర‌మాదానికి గురైన బ‌స్సు నుజ్జునుజ్జ‌యింది.ప్ర‌మాదం చోటు చేసుకున్న స‌మ‌యంలో బ‌స్సులో దాదాపు 40 మంది ఉన్నారు.ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com