బాలయ్య - అనిల్ రావిపూడి మూవీ: కథ ఏంటో తెలుసా.?
- July 04, 2022
నందమూరి నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమా పూర్తి కాగానే, అనిల్ రావిపూడి తన ప్రాజెక్టును పట్టాలెక్కించేయనున్నాడు.
కాగా, ఈ సినిమా తల్లీ కూతురు సెంటిమెంట్‌తో రూపొందబోతోందన్న సంగతి ఆల్రెడీ అనిల్ రావిపూడి చిన్న హింట్ ద్వారా రివీల్ చేసేశాడు. బాలయ్యకు కూతురుగా ‘పెళ్లి సందడి’ భామ శ్రీ లీల నటించనుందని కూడా అధికారికంగా ప్రకటించేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ సినిమాకి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీకి ఇది ప్రీ మేక్ అని తెలుస్తోంది. ‘దర్బార్’ లో రజనీకాంత్‌కి కూతురుగా నివేదా థామస్ నటించిన సంగతి తెలిసిందే.
తండ్రీ కూతుళ్లుగా రజనీకాంత్, నివేదా థామస్ కాంబినేషన్ చాలా బాగుందని అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందాయి. అదే తీరుగా ఇప్పుడు శ్రీలీల కూడా బాలయ్యకు కూతురుగా మంచి పేరు తెచ్చుకునేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది.
శ్రీ లీల మంచి నటి. తొలి సినిమా ‘పెళ్లి సందడి’ హిట్ కాకపోయినా, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ టాలెంట్‌తోనే వరుసగా అవకాశాలు కూడా పట్టేస్తోందీ కన్నడ కుట్టీ.
తాజా వార్తలు
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ







