ప్రబాస్ సింప్లిసిటీకి పడిపోయానంటోన్న పవన్ హీరోయిన్.!
- July 04, 2022
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ శృతిహాసన్. పవన్ కళ్యాణ్‌తో నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాతో శృతిహాసన్ దశ తిరిగిపోయిందని స్వయంగా శృతిహాసనే చెప్పుకొచ్చింది చాలా సార్లు. ఆ తర్వాత శృతి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ పరిశ్రమల్లోనూ సత్తా చాటింది.
అయితే, మధ్యలో ప్రేమ, పెళ్లి.. అంటూ సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడే పుంజుకుంటోంది. ‘క్రాక్’ సినిమాతో శృతిహాసన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ వరుసగా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటూ మళ్లీ స్టార్‌డమ్ దిశగా పరుగులు పెడుతోంది.
తాజాగా శృతిహాసన్, ప్రబాస్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రబాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలో శృతిహాసన్ హీరోయిన్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్‌లో శృతిహాసన్, బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది.
ప్యాన్ ఇండియా స్టార్ అయినా కానీ, ప్రబాస్ చాలా సింపుల్‌గా వుంటాడనీ, ఆయన సింప్లిసిటీకి పడిపోయానని ఓపెన్‌గా చెబుతోంది శృతిహాసన్. అలాగే, ప్రబాస్‌తో ఏ సినిమా చేసినా, ఆ సినిమా హీరోయిన్లు సాధారణంగా చెప్పే మాట ఫుడ్ కేరింగ్ గురించి. తన ఇంటి నుంచి స్వయంగా తెచ్చిన నాన్ వెజ్ ఫుడ్‌తో తన టీమ్ మొత్తాన్ని పోషిస్తుంటాడు ప్రబాస్.
టాలీవుడ్ భామలే కాదు, బాలీవుడ్ భామలైన దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, దిశా పటానీ తదితరులు ఇదే అంశాన్ని పలుమార్లు ప్రమతో ప్రస్థావించారు కూడా. ఇప్పుడు శృతిహాసన్ కూడా అదే విషయాన్ని చెబుతూ మురిసిపోతోంది. అన్నట్లు శృతిహాసన్‌కి ‘సలార్’ మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







