శ్రీ విష్ణు అస్సలు తగ్గేదేలె.. సిట్యువేషన్ భలే వాడేసుకుంటున్నాడులే.!
- July 04, 2022
విలక్షణ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న సినిమా ‘అల్లూరి’. ఈ రోజు మన్నెందొర అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.
అల్లూరి జయంతి సందర్భంగా గత కొన్ని రోజులుగా మీడియాలో హడావిడి నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ హడావిడిని తన సినిమాకి బాగానే క్యాష్ చేసుకుంటున్నాడీ యంగ్ హీరో.
మొన్న ప్రీ లుక్ అంటూ.. రెండు పోస్టర్లు రిలీజ్ చేసి, సినిమాపై ఆసక్తి రేకెత్తించాడు. ఈ రోజు టీజర్ రిలీజ్ చేసి, సినిమాపై అంచనాలు పెంచేశాడు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో శ్రీ విష్ణు నటిస్తున్నాడు ఈ సినిమాలో.
‘విప్లవానికి నాంది, చైతన్యానికి పునాది, నిజాయితీకి నిలువెత్తు రూపం..’ అంటూ రిలీజైన ‘అల్లూరి’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పక్కింటబ్బాయ్ ఇమేజ్ వున్న శ్రీ విష్ణు ఈ సినిమా కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయిపోయాడు.
డిఫరెంట్ లుక్స్‌లో పోలీసాఫీసర్‌గా పవర్ ఫుల్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు. సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. రిలీజ్ కూడా ఇంకా ఇప్పుడప్పుడే కాదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్ని తన సినిమా ప్రమోషన్‌కి కనెక్ట్ చేసి, బాగానే సద్వినియోగం చేసుకుంటున్నాడీ యంగ్ హీరో.
ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా శ్రీ విష్ణుకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలంటే ఇంకాస్త టైమ్ వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







