సీనియర్ నటుడు నరేష్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ: ఈ వివాదానికి ముగెంపు ఎప్పుడో.!
- July 04, 2022
సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ మధ్య అఫైర్ ఇష్యూ తాజాగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.తనకు విడాకులివ్వకుండా, మరో మహిళతో కలిసి ఎలా వుంటాడు.. అంటూ నరేష్పై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి పలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఇష్యూ ఇప్పుడు ఇంకాస్త ముదిరి పాకాన పడింది. బెంగుళూర్‌లోని మోసూర్ హోటల్‌లో పవిత్రా లోకేష్‌తో కలిసి వున్న నరేష్‌ను రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారిద్దరూ బస చేసిన ఆ హోటల్ రూమ్ వద్దే బైఠాయించి పెద్ద డ్రామానే ప్లే చేసింది. చివరికి పోలీసులు కలగచేసుకోవడంతో, బందోబస్తు మధ్య నరేష్, పవిత్రా లోకేష్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ సమయంలో రమ్య రఘుపతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, చెప్పుతో నరేష్‌పై దాడికి దిగింది. ఈ క్రమంలో ఆమెని వారించే ప్రయత్నం చేసిన పోలీసుల మీద కూడా ఆమె దాడి చేసింది.
సహజంగానే ఇలాంటి ఇష్యూస్‌కి క్రేజ్ ఎక్కువ. అందులోనూ ఇంత క్రేజీయెస్ట్‌గా సాగుతోన్న ఈ రచ్చ డ్రామాకి కొన్ని ఛానెళ్లు, తమ టీఆర్‌పీ రేటింగులు పెంచుకునే క్రమంలో మరింత హంగామా చేస్తూ, హైప్ పెంచుతున్నారు.
కాగా, నరేష్ వెర్షన్ ఎలా వుందంటే, రమ్యతో తనకు ఎప్పుడో తెగతెంపులు అయిపోయాయనీ, పవిత్రా లోకేష్ తనకు మంచి స్నేహితురాలనీ, రమ్య తనను ఆర్ధికంగా, మానసికంగా క్షోభ పెట్టడంతో, తాను చాలా కుంగుబాటుకు లోనయ్యాననీ, ఆ టైమ్‌లో పవిత్రా లోకేష్ తనకు తోడుగా వుందనీ చెప్పుకొచ్చాడు.
అలాగే, పవిత్రా లోకేష్ కూడా, నరేష్ చాలా మంచి వ్యక్తి అనీ, తమ మధ్య వున్న రిలేషన్‌షిప్‌ని చాలా నీచంగా మాట్లాడుతూ, తనను బ్యాడ్ చేసేలా రమ్య వ్యాఖ్యలున్నాయనీ వాపోయింది పవిత్ర లోకేష్.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







