ఈద్ అల్ అధా 2022.. కోవిడ్ భద్రతా నియమాలు

- July 05, 2022 , by Maagulf
ఈద్ అల్ అధా 2022.. కోవిడ్ భద్రతా నియమాలు

యూఏఈ: ఈ వారాంతంలో ఈద్ అల్ అదా సందర్భంగా నివాసితులు తప్పనిసరిగా పాటించాల్సిన కోవిడ్ భద్రతా నియమాలను నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA)  ప్రకటించింది. బలి మాంసం, బహుమతులు, ఆహారాన్ని పొరుగువారి మధ్య పంపిణీ చేయడానికి అనుమతించబడుతుందని పేర్కొన్నారు. అయినప్పటికీ  పంపిణీకి ముందు వాటిని శుభ్రమైన, క్రిమిరహితం చేసిన బ్యాగ్‌లు లేదా పెట్టెల్లో ఉంచాలని స్పష్టం చేసింది. కమ్యూనిటీ ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి నివాసితులు ఈద్ 72 గంటలలోపు PCR పరీక్ష చేయించుకోవాలని సూచించారు. జంతువులను వధించడానికి లైసెన్స్ లేని కార్మికులను వినియోగించవద్దని కోరింది. పిల్లలకు ఇచ్చిన ఈద్ డబ్బును బదిలీ చేయడానికి యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను ఉపయోగించమని నివాసితులకు సూచించింది. తమ కుటుంబాల్లోనే వేడుకలను పరిమితం చేసుకోవాలని పౌరులు/నివాసితులకు సూచించారు.  కుటుంబ సందర్శనల సమయంలో మాస్కులు ధరించాలని,  ఇతరుల నుండి సురక్షితమైన సామాజిక దూరాన్ని పాటించాలని కోరింది.  ముఖ్యంగా వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com