ముగ్గురు బాలికలను వేధించిన థెరపిస్ట్.. నిర్దోషిగా ప్రకటించిన బహ్రెయిన్ కోర్టు

- July 05, 2022 , by Maagulf
ముగ్గురు బాలికలను వేధించిన థెరపిస్ట్.. నిర్దోషిగా ప్రకటించిన బహ్రెయిన్ కోర్టు

బహ్రెయిన్: స్నేహితులుగా ఉన్న ముగ్గురు బాలికలను వేధించిన కేసులో ఫిజియోథెరపిస్ట్‌ను హై క్రిమినల్ కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది.లైంగిక వేధింపుల ఘటన జరిగిన సమయంలో వారు ఫిజియోథెరపిస్ట్‌ క్లినిక్‌లో రోగులుగా ఉన్నందున వారి ఆరోపణలు నమ్మశక్యం కానిదిగా కోర్టు భావించింది.కోర్టు ఫైల్స్ ప్రకారం..ఫిజియోథెరపిస్ట్ క్లినిక్ ప్రారంభించేందుకు బహ్రెయిన్ వచ్చారు.ముగ్గురూ అతని పర్యవేక్షణలో శిక్షణ పొందారు.కానీ చివరకి ఫిజియోథెరపిస్ట్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.ఆరోపణలు చేసిన ముగ్గురు బాలికలు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం కేసు నమోదు చేశారన ప్రతివాది న్యాయవాది వాదించారు. ఆరోపణలు చేసిన వారిలో ఒకరు తన స్వంత క్లినిక్‌ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు.దీంతోపాటు క్లినిక్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా కోర్టు వీక్షించగా.. పరిస్థితి పూర్తిగా సాధారణమేనని, ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తేలింది.ఇవన్నీ పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై అభియోగాలను కొట్టివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com