నేటి నుండి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు

- July 05, 2022 , by Maagulf
నేటి నుండి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈరోజు నుండి మొదలుకానుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఈ నెల 19 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. వాటిని 20న పరిశీలిస్తారు.ఉపసంహరణకు తుది గడువు జులై 22. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఆగస్టు 6న నిర్వహిస్తారు.లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులు. నామినేటెడ్‌ సభ్యులకూ అర్హత ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com