నేటి నుండి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు
- July 05, 2022
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈరోజు నుండి మొదలుకానుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఈ నెల 19 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. వాటిని 20న పరిశీలిస్తారు.ఉపసంహరణకు తుది గడువు జులై 22. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఆగస్టు 6న నిర్వహిస్తారు.లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులు. నామినేటెడ్ సభ్యులకూ అర్హత ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







