చైతూ కోసం నిఖిల్ వెనక్కి వెళతాడా.? లేదా.?
- July 05, 2022
చైతూ ప్రస్తుతం ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నాడు.రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకుడు.కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది.
ఈ సినిమాని ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆగస్ట్ 22 అనే డేట్‌ని లాక్ చేశాడట నిర్మాత దిల్ రాజు. అయితే, అదే రోజు ఆల్రెడీ నిఖిల్ సిద్దార్డ్ హీరోగా రూపొందిన ‘కార్తికేయ 2’ విడుదలకు సిద్ధంగా వుంది.ఈ సినిమాపై నిఖిల్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
కానీ, నిఖిల్‌ని వెనక్కి తగ్గాలంటూ, దిల్ రాజు అండ్ టీమ్ ‘కార్తికేయ 2’ మేకర్లతో మంతనాలు జరుపుతున్నారట. ‘లవ్ స్టోరీ’ సినిమా తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘థాంక్యూ’ సినిమాపై అంచనాలున్నాయి.
అయితే, ఆ అంచనాల్ని అందుకోవాలంటే, వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ కావల్సి వుంది. ఇప్పటికే అనుకున్నషెడ్యూల్ని మించి ఆలస్యమవుతూ వస్తోంది ఈ సినిమా. ఈ సారి ఇక లేట్ చేయకూడదని ‘థాంక్యూ’ టీమ్ భావిస్తోందట. మరి, నిఖిల్ తగ్గుతాడా.? లేదా.? అనేది వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







